.

'మనం తోటి వారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం మాత్రం చేయకూడదు.' అని తెలియజేసే నీతి కథే ఈ 'మాయా క్రికెట్ బ్యాట్'. సచిన్ అనే పిల్లోడు తనకి తెలిసో తెలియకో చేసిన సాయం.. తనకు అపకారం చేయాలని చూసిన స్నేహితుల నుండి ఎలా కాపాడిందనేది ఈ కథ సారాంశం.

మనం ఎవరికైనా సాయం చేస్తే.. సాయం పొందిన వారు మనకు ఏదో ఓ రకంగా సాయపడతారు. మనం ఆపదలో ఉంటే అండగా నిలబడి మనల్ని కాపాడుతారు. అదే సచిన్ విషయంలో రుజువైంది. అతను స్నేహితులతో క్రికెట్ ఆడుతూ అనుకోకుండా ఒకరికి సాయం చేస్తాడు. ఆ సాయం పొందిన వారు సచిన్ కి ఓ విషయంలో అండగా నిలబడతారు.

తెలిసి తెలియని వయసున్న సచిన్ స్నేహితులు.. అతన్ని క్రికెట్ లో ఓడించాలన్న ఉద్దేశంతో కావాలని గాయపరుస్తారు. సచిన్ ని క్రికెట్ ఆడకుండా చేసి తనపై గెలవాలని చూస్తారు. కానీ సచిన్ చేసిన సాయం అతన్ని గెలిపిస్తుంది. అతనికి అపకారం చేయాలని చూసిన స్నేహితులకు బుద్ది చెబుతుంది. ఆ కథేంటో మీరు చూసేయండి.